ఉత్తర కొరియా కవ్వింపు చర్య.. మూడు నెలల్లో రెండోసారి
ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యకు పాల్పడిరది. మూడు నెలల వ్యవధిలో రెండో సారి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి సుమారు 70 నిమిషాలపాటు 1,000 కి.మీ. ప్రయాణించి జపాన్ సమీపంలోని సముద్ర జలాల్లో పడింది. ఇది గరిష్ఠంగా 6 వేల కి.మీ. ఎత్తులో దూసుకెళ్లినట్లు జపాన్, దక్షిణ కొరియా అంచనా వేశాయి. తమ భూభాగం సమీపంలో అమెరికా నిఘా విమానం చక్కర్లు కొడుతోందని, దీనిపై అగ్రరాజ్యం అనూహ్య పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించిన రెండురోజులకే ఉత్తర కొరియా ఈ చర్యకు పాల్పడటం గమనార్హం.













