మళ్లీ ఉత్తర కొరియా కవ్వింపు చర్య
ఉత్తర కొరియా మరొక సారి కవ్వింపు చర్యలకు తెరలేపింది. జపాన్ గగనతలం మీదుగా దూసుకుళ్లేలా ఒక బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించింది. ఉత్తర కొరియాలోని గుర్తు తెలియని ప్రదేశం నుంచి గాలిలోకి లేచిన ఈ క్షిపణి 4,500 కిలో మీటర్లు ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయింది. అమెరికా అధీనంలోని గ్వామ్ దీనిని ఈ క్షిపణి తాకగలదని అంచనా. అమెరికా జపాన్‌లను రెచ్చగొట్టేందుకే ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు భావిస్తున్నారు. కాగా ఉత్తర కొరియా క్షిపణి తన గగనతలం మీగా దూసుకువెళ్లడంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించింది.













