ప్రపంచ దేశాలన్నీ సంబరాల్లో ఉండగా.. ఉత్తర కొరియా మాత్రం
ప్రపంచ దేశాలన్నీ 2023 సంవత్సరానికి స్వాగతం పలికే సంబరాల్లో నిమగ్నమై ఉండగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. జనవరి 1వ తేదీన తెల్లవారుజామున శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణిని నింగిలోకి ఎగిరేలా చేశారు. తద్వారా కొత్త సంవత్సరంలో తన లక్ష్యాలను ఉద్దేశాలను ప్రపంచానికి చెప్పకనే చెప్పారు. కాగా ఉత్తర కొరియా ఉత్తర రాజధాని ప్రాంతం నుంచి క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ ఒక ప్రకటనలో తెలిపారు. కొరియా`జపాన్ మధ్య సముద్ర జలాల్లో పడి పోయే ముందు ఈ క్షిపణి దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించినట్లు దక్షిణ కొరియా గుర్తించింది. గత ఏడాది 70కి పైగా క్షిపణులను ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించింది.













