వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి
ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల ప్రకటన మొదలైంది. వైద్యశాస్త్రంలో విశేష సేవలందించినందుకు ఈసారి ఇద్దరిని వరించింది. అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, అర్డెమ్ పటాపౌటియన్‌లు సంయుక్తంగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉష్ణ గ్రాహకాలు, శరీర స్వర్శపై వీరు చేసిన పరిశోధనలకు నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ జ్యూరీ వెల్లడిరచింది. మానవ నాడీ వ్యవస్థలో ఉష్ణము, చలి, స్పర్శ వంటి సంకేతాలు ఎలా ప్రారంభమవుతాయనే విషయాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరణలు స్పష్టంగా వివరించాయి. ఈ ఆవిష్కరణలు ఎన్నో శరీరక వ్యవస్థలు, వ్యాధుల పరిస్థితులను తెలుసుకోవడం ఎంతో కీలకమైనవి అని నోబెల్ జ్యూరీ అభిప్రాయపడింది.
రోజువారీ జీవితంలో ఈ అనుభూతులను చాలా తేలికగా తీసుకుంటాం. కానీ ఉష్ణోగ్రత, పీడనాన్ని గ్రహించడానికి నరాలు ఎలా ప్రేరేపించబడతాయనే ప్రశ్నలకు తాజాగా ఇద్దరు శాస్త్రవేత్తలు సమాధానాన్ని కనుగొన్నారని నోబె జ్యూరీ తెలిపింది. అవార్డులో భాగంగా పసిడి పతకం, 10 మిలియన్ స్వీడిష్ క్రానర్ (దాదాపు 1.14 మిలియన్ డాలర్లు) అందిస్తారు. అలాగే, భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో నోబెల్ ఫ్రైజ్‌ను బహుకరిస్తారు.













