కొవిడ్ టీకా పరిశోధనలకు నోబెల్ పురస్కారం
కరోనా టీకాల అభివృద్ధికి మార్గం చూపిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. ఎంఆర్ఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన కాటలిన్ కరికో (హంగేరి), డ్రూ వెయిస్‌మన్‌లకు (అమెరికా) ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. నోబెల్ అసెంబ్లీ సెక్రెటరీ థామస్ పెర్ల్‌మాన్ ఈ పురస్కారాలను ప్రకటించారు. కొవిడ్ రూపంలో మానవాళికి పెను ముప్పు తలెత్తిన తరుణంలో వేగవంతంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంలో వీరి పరిశోధనలే కీలకంగా మారాయని నోబెల్ ప్యానల్ కొనియాడిరది. గత ఏడాది స్వీడన్‌కు చెందిన స్వాంటె పాబోకు వైద్య నోబెల్ లభించింది.













