అమెరికా నగరాలతో కైలాస ఒప్పందాలు !
వివాదాస్పద గురు నిత్యానంద స్థాపించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశం అమెరికాలోని పలు నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను కుదుర్చుకుందట. కైలాస తో సోదరి-నగరం ఒడంబడికను చేసుకున్నట్లు న్యూజెర్సీలోని నెవార్క్ నగరం ఇటీవలే ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 12న జరిగిన ఈ సంతకాల కార్యక్రమానికి నగరంలోని సిటీ హాల్ వేదికగా నిలిచింది. మరోపక్క రిచ్మండ్, వర్జీనియా, డేటన్, ఒహాయో, బ్యూనా పార్క్, ఫ్లోరిడా వంటి 30 నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యాలను కుదుర్చుకున్నట్టు కైలాస దేశం వెబ్సైట్లో పేర్కొన్నారు.













