అమెరికా పర్యటనకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అధికారిక పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లారు. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ (డబ్ల్యూబిజీ), అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఎంఎఫ్) సమావేశానికి ఆమె హాజరవుతారు. దీంతో పాటు ఆమె జి20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో పాల్గొంటారు. ఆమె అనేక దేశాలతో పెట్టుబడిదారులు, ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశాలన్నీ ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి. ఈ పర్యటనలో సీతారామన్‌తో పాటు ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖకు చెందిన కొందరు అధికారులు కూడా ఉన్నారు. ఏప్రిల్ 10న పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్‌లో పాల్గొంటారు. 11న అమెరికా ట్రెజరీ కార్యదర్శి జానెట్ యెల్లెన్‌తో సమావేశం కానున్నారు.













