న్యూజిలాండ్ లో దీక్షా దివస్…
న్యూజిలాండ్ టీఆర్ఎస్ ఎన్నారైశాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌భాస్కర్‌రెడ్డి కొసన, గౌరవ అధ్యక్షులు నర్సింగరావు ఇనగంటి, కల్యాణ్‌రావు, అధ్యక్షుడు జగన్‌రెడ్డి ఒడ్నాల దీక్షా దివస్ నిర్వహించారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత, ఉధ్యమ సారథి కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన నిరాహార దీక్షకు 11 ఏండ్లు పూర్తయ్యాయి. దీక్షాదివస్ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ న్యూజిలాండ్ ఎన్నారైశాఖ ప్రధాన కార్యదర్శి అరుణ్ ప్రకాశ్, ఉపాధ్యక్షుడు రామారావు రాచకొండ, ఉమెన్స్ అఫైర్స్ చైర్పర్సన్ సునీతా విజయ్, మోహన్‌రెడ్డి బీరపు, పానుగంటి శ్రీనివాస్, ఆశ్ ఒడ్నాల, మౌనికరావు, రవీందర్ పాల్గొన్నారు.













