న్యూజిలాండ్ కీలక నిర్ణయం… భారత్ ప్రయాణికులకు నో ఎంట్రీ
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను (ఆ దేశ పౌరులతో సహా) తమ దేశంలోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్ 11 సాయంత్రం 4 గంటల నుంచి ఏప్రిల్ 28 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. ప్రయాణికుల రాకపై తాత్కాలిక నిషేధం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను మేం అర్థం చేసుకోగలం. కానీ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని తెలిపారు. అవసరమైతే నిషేధాన్ని మరింత కాలం పొడగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ సరిహద్దులో పనిచేసే సిబ్బందిలో ఓ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.













