అమెరికాలో ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్న తెలుగమ్మాయి దీప్తి
ఇంటర్నేషనల్ ప్రాముఖ్యత ఉన్న అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ఫ్యాషన్ వీక్ మరియు న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లలో రాణించారు మన తెలుగమ్మాయి, డిజైనర్ దీప్తి దొడ్ల. ‘ద్రిష క్లాజెట్’ సీఈఓ దీప్తి అమెరికాలో టెన్నెస్సీ లో ఉంటారు. స్థానిక తెలుగు సంఘం అధ్యక్షరాలిగా ఇంతకు మునుపే సేవలందించడం వల్ల అందరికీ సుపరిచితురాలే.
గత వారం ముగిసిన 79 సంవత్సరాల చరిత్ర కలిగిన న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ద్రిష క్లాజెట్ కి ప్రాతినిధ్యం వహిస్తూ తన డిజైన్స్ ని మెరికల్లాంటి 40 మంది మోడల్స్ తో ప్రజంట్ చేసారు. న్యూయార్క్ లోని గోతం హాల్లో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షో ద్రిష క్లాజెట్ తో ప్రారంభమవడం గొప్ప విషయం. రియాలిటీ టీవీ స్టార్స్, ప్రముఖ మోడల్స్ ఈ షో బిగినర్స్ మరియు షో స్టాపర్స్ అవడం విశేషం. ఇదే న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో మరో షో మిలియన్స్ లో ఔట్రీచ్ ఉన్న ‘హైటెక్ మోడ’ కూడా అందమైన మోడల్స్ తో ఇంక్లూసివ్ షో గా ముగిసింది.
ఇక మొన్న నిర్వహించిన ప్రత్యేకమైన లాస్ ఏంజెలెస్ ఫ్యాషన్ వీక్ లో కూడా డిజైనర్ దీప్తి ‘ది ఫ్యాషన్ లైఫ్ టూర్’ లో ద్రిష క్లాజెట్ ని అన్ని దేశాలకు చెందిన సెలబ్రిటీ మోడల్స్ తో ప్రదర్శించారు. ప్రముఖ నటి మరియు రికార్డింగ్ కళాకారిణి అయిన మిలా నాబొర్స్ ఈ షో కి షో స్టాపర్ అవడం గర్వించదగ్గ విషయం. ఫ్యాషన్ రంగంలో ఎన్నో ఆటుపోటులను తట్టుకొని నిలబడడం తెలుగు ఆడపడుచులకు కష్టమే. అయినప్పటికీ వినూత్నమైన కటింగ్ ఎడ్జ్ డిజైన్స్ తో మిగతా ట్రెండీ డిజనర్లకు పోటాపోటీగా రెండు ఫ్యాషన్ వీక్ లలోనూ ప్రదర్శించిన డిజైనర్ దీప్తి, వివిధ దేశాల టాప్ మోడల్స్ ని సమన్వయం చేసుకుంటూ డిజైనర్ గా తన బ్రాండింగ్ ని అభివృద్ధి చేసుకుంటూ ఫ్యాషన్ రంగంలో దూసుకెళుతున్నారు.













