తక్షణం ఇజ్రాయెల్ వీడిన అమెరికా విదేశాంగ మంత్రి
ఇజ్రాయెల్ దాడులు తిరిగి ఆరంభమైన దశలో అక్కడ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఉన్నారు. ఆయన దుబాయ్‌లో కాప్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లుతూ బ్లింకెన్ ఇక్కడ కొద్ది సేపు ఆగారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ అధికారులతో చర్చించారు. హమాస్ నిర్మూలనకు జరిగే దాడి దశలో పాలస్తీనియా పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాల్సి ఉందని కోరారు. బందీల విడుదల మరో వైపు హమాస్ ఏరివేత తమ ముందున్న రెండు లక్ష్యాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ దశలో అమెరికా విదేశాంగ మంత్రికి తెలిపినట్లు వెల్లడైంది. గాజా నుంచి ఇక ముందు ఎప్పుడూ ఇజ్రాయెల్‌పై దొంగదెబ్బ తగలకుండా చేయడమే తమ ముందున్న ఆలోచన అని నెతాన్యాహూ తెలిపారు. ఖాన్ యూనిస్ నగర తూర్పు ప్రాంతం వారు వెంటనే నివాసాలు ఖాలీ చేసి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం పంపిణీ చేసిన కరపత్రాలతో పేర్కొన్నారు.













