భారత్ వెలుపలా యూఎస్ వీసా అపాయింట్ మెంట్లు
అమెరికా వీసాల కోసం భారతీయులకు నెలల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. వ్యాపారం (బీ1), పర్యాటకం(బీ2) నిమిత్తం అమెరికా వెళ్లాలనుకునే వారు కూడా 400 రోజులకు పైగా వేచిచూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వీసా అపాయింట్మెంట్ల నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు భారత్ వెలుపుల ఉన్న దౌత్య కార్యాలయాల్లోనూ వీసా అపాయింట్మెంట్ పొందే అవకాశం కల్పించాలని అధ్యక్ష కార్యాలయం ఇటీవల కొన్ని సిఫారసులు చేసింది. తాజాగా ఈ సూచనలను అగ్రరాజ్యం అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో వివిధ దేశాల్లో పర్యటిస్తున్న భారతీయులు ఢిల్లీలోని రాయబార కార్యాలయానికి రాకుండానే ఆయా దేశాల్లోని అమెరికా ఎంబసీల్లో వీసా అపాయింట్మెంట్ పొందవచ్చన్నమాట.













