గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు జాక్‌పాట్
గూగుల్ లో 12 వేల మందిని తొలగిస్తున్నట్లు రోజు రోజుల క్రితం ఈ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కష్ట సమయంలో బాధిత ఉద్యోగులకు కంపెనీ అండగా నిలుస్తుందని కూడా తెలిపారు. తాజాగా ఇప్పుడు మరొక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని కొన్ని వారాల ముందే సుందర్ పిచాయ్ భారీ వేతన పెంపును అందుకున్నారు. సీఈవోగా సుందర పిచాయ్ అద్భుతమైన పని తీరు కనబరుస్తున్నారని పేర్కోన్న గూగుల్ అందుకు ప్రతిఫలంగా ఈక్విటీ రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. అందులో భాగంగా 2019లో 43 శాతంగా ఉన్న పెర్మార్మెన్స్ స్టాక్ట్ యూనిట్స్ (పీఎస్‌యూలు)ను 60 శాతానికి సమరిస్తున్నట్లు పేర్కొంది. ఫలితంగా పిచాయ్ వేతనం భారీగా పెరిగింది. ప్రతి మూడు సంవత్సరాలకు గూగుల్ సీఈవోకు ఈక్విటీ కాంపెన్జేషన్ లభిస్తుంది.













