పలు దేశాలకు కొత్త దౌత్యవేత్తలు: కేంద్రం
బ్రిటన్, జపాన్, కెనడా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్, కెన్యా దేశాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త దౌత్యవేత్తలను నియమించనున్నది. బంగ్లాదేశ్‌కు భారత నూతన హై కమిషనర్‌గా సీనియర్ దౌత్యాధికారి ప్రణయ్ వర్మ నియామకం పొందనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈయన ప్రస్తుతం వియత్నాం రాయబారిగా ఉన్నారు. ఆయా దేశాల్లో పనిచేస్తున్న పలువురికి స్థాన చలనం ఉంటుందని తెలిపారు. ఇక కెనడాకు సంజయ్ వర్మ, న్యూజిల్యాండ్‌కు నీతూ భూషన్, దక్షిణ కొరియాకు అమిత్‌కుమార్, బ్రిటన్ రాయబారిగా విక్రం దొరైస్వామి, కెన్యాకు కొత్త రాబాయారిగా నంగ్యా సి ఖంపా, జపాన్‌కు సీబీ జార్జ్ వెళ్లనున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.
.













