నా భర్తను పుతినే చంపేశారు. : నావల్నీ భార్య
తన భర్తను రష్యా అధ్యక్షుడు పుతిన్ చంపేశారని ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ భార్య యూలియా నావల్నయా ఆరోపించారు. నావల్నీని మూడేళ్లు తీవ్ర వేధింపులు,చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొంటూ మాట్లాడారు. అవినీతి, అన్యాయం, యుద్ధానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తేనే నావల్నీకి అసలైన నివాళులర్పించినట్లు అవుతుందని పిలుపునిచ్చారు. ఆయన మరణం వెనక రహస్యాలన్నింటినీ నిగ్గు తేలుస్తానని ప్రతినబూనారు నావల్నీ మృతదేహాన్ని ఇంకా తమకు అప్పగించకపోవడంపై విమర్శలు గుప్పించారు.













