5 లక్షల డాలర్లు ఆఫర్.. అమెరికాలోని టీమ్స్‌కు మాత్రమే
అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మార్స్ పైకి ఆస్ట్రోనాట్లను పంపించాలని భావిస్తున్న నాసా.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వాళ్లకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో చెప్పిన వారికి 5 లక్షల డాలర్ల బహుమతి ప్రకటించింది. దీనికి డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్ అనే పేరు పెట్టారు. స్పేస్ మిషన్లలో ఆస్ట్రోనాట్ల ఆహారానికి సంబంధించి కొత్త వ్యవస్థలు, టెక్నాలజీలను కనుగొనాలని నాసా కోరింది. ఇది సులవైన చాలెంజ్ ఏమీ కాదు. మార్స్ పైకి ప్రయాణమంటే రాను. పోను కలిపి కనీసం మూడేళ్లు పడుతుంది. అంత సుదీర్ఘ సమయం పాటు ఆస్ట్రోనాట్లకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలి. అలా అని రాకెట్‌ను ఆహారంతో నింపే పరిస్థితి ఉందు. ఇప్పటికే దీనికోసం అల్ట్రా హై కెలరీ చాక్లెట్ బార్లను కనుకొన్నా.. అంత సుదీర్ఘ ప్రయాణానికి సరిపడ్డా వీటిని పంపించాలంటే రాకెట్ బరువు విపరీతంగా పెరుగుతుంది. అందుకే కొత్త మార్గాల్లో ఆస్ట్రోనాట్లకు ఆహారం అందించడం ఎలాగో చెప్పాలని నాసా కోరుతోంది.
వినూత్న ఆలోచనలను నాసాతో పంచుకోవాలని అనుకుంటున్న వాళ్లు మే 28 వరకూ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత జులై 30 లోపు తన వినూత్న ప్రాజెక్ట్‌లను నాసాకు అందించాలి. టాప్ 20 టీమ్స్ కు ఒక్కొక్కరికీ 25 వేల డాలర్ల చొప్పున మొత్తం 5 లక్షల డాలర్లు ఇస్తారు. అయితే ఈ ఆఫర్ కేవలం అమెరికాలోని టీమ్స్‌కు మాత్రమే పరిమితం చేశారు.













