న్యూజెర్సీలో నల్గొండ వాసి అనుమానాస్పద మృతి
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని దేవరకొండకు చెందిన అమెరికన్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) దేవేందర్ రెడ్డి నల్లమడ (డిసెంబర్ 29) న్యూజెర్సీలోని ఎడిసన్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన ఎలా చనిపోయాడనే దానిపై పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. దేవందర్ రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అలాగే అమెరికాలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాడు. దేవేందర్‌రెడ్డి ఆపదలో ఉన్న ఎవరికైనా సహాయం అందించడంలో ముందుంటాడని యూఎస్‌లోని అతని స్నేహితులు తెలిపారు. అమెరికాలో తెలంగాణ సొసైటీ ఏర్పాటులో చురుగ్గా వ్యవహరించారు. దేవేందర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు నివాళుర్పించారు.













