అగ్రరాజ్యం లో మైక్రోవేవ్ దాడులు…

అగ్రరాజ్యం అమెరికాను హవానా సిండ్రోమ్ కలవరపెడుతున్నది. అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బందిపై మెక్రోవేవ్, రేడియో వేవ్ దాడులు జరుగుతున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ దాడుల వెనుక ఎవరున్నారో శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు కనుగొనలేకపోయారు. ఈ రహస్య దాడులకు సంబంధించి ఇప్పటి వరకు 130 కేసులు నమోదయ్యాయని అమెరికన్ అధికారి ఒకరు తెలిపారు. గత సంవత్సరంలోనే డజన్ల కొద్దీ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ఈ దాడులపై జాతీయ భద్రతా మండలి కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేపట్టాలని, అలాగే బాధిత అధికారులకు మెరుగైన వైద్య సంరక్షణను అందించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. ఇటువంటి దాడుల మొదటి కేసు 2006 లో క్యూబాలోని యూఎస్ ఎంబసీలో బయటపడింది. అందుకే దీనికి హవానా సిండ్రోమ్ అని పేరు పెట్టారు.