అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని 14వ యూస్ట్రీట్లోని మ్యూజిక్ ఈవెంట్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, పలువురు గాయపడినట్టు సమాచారం. ఈ ఘటన జరిగిన ప్రదేశం శ్వేత సౌధానికి కేవలం 2 మైళ్ల్ల దూరంలో ఉంది. కాల్పులకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గాయపడిన వారిలో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారని మెట్రో పాలిటన్ పోలీస్ శాఖ ప్రతినిధి చెప్పారు. కాల్పులకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ కూడా వైరల్గా మారింది.కాల్పుల్లో గాయపడిన వవారిని ఆస్పత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీస్ శాఖ తెలిపింది.













