అమెరికా కంటే ఎక్కువగా.. భారత్ లోనే

దేశంలో కనీసం ఒక్క డోసు కోవిడ్ టీకా తీసుకున్న వారి సంఖ్య అమెరికా కంటే ఎక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరింత వేగవంతం చేస్తామని తెలిపింది. దేశంలో కనీసం ఒక్క డోసైనా కోవిడ్ టీకా తీసుకున్న వారు 17.2 కోట్లు కాగా, అమెరికా ఇది 16.9 కోట్లుగా ఉందని పేర్కొంది. దేశంలోని 60 ఏళ్లు పైబడిన వారిలో 43 శాతం మంది, 45 ఏళ్లు పైబడిన వారిలో 37 శాతం మంది టీకా వేయించుకున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు. రానున్న కొద్ది వారాల్లోనే 50 శాతం దాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి 10 లక్షల జనాభాలో కోవిడ్ బారిన పడి వారి సంఖ్య ప్రపంచ సరాసరి 22.181 కాగా, భారత్‍లో అది 20,519గా ఉందని వివరించారు. అదే సమయంలో ప్రతి 10 లక్షల మంది బాధితుల్లో కోవిడ్ మృతుల భారత్‍లో 245 మాత్రమే కాగా, ప్రపంచ సరాసరి 477 అని ఆయన పేర్కొన్నారు.