ప్రధాని మోదీ, జో బైడెన్ భేటీ!
మే 24న ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీలో జరిగే క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారని సంబంధిత వర్గాలు తెలిపారు. అదే సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల ప్రధానమంత్రులు హాజరవుతారు. ఈ సందర్భంగా జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ ఏకాంతంగా సమావేశమయ్యే అవకాశం ఉందని వెల్లడించాయి. ఉక్రెయిన్ ఘర్షణ తాలుకు విపరిణామాలు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితి గురించి క్వాడ్ సదస్సు చర్చించే అవకాశం ఉంది. శ్వేతసౌధం వర్గాలు చెప్పినదాన్ని బట్టి హిరోషిమాలో జరిగే జీ`7 సదస్సుకు, సిడ్నీలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు.













