అందాల పోటీల చరిత్రలో తొలిసారిగా.. ఓ ట్రాన్స్జెండర్ కు
అందాల పోటీల చరిత్రలో ఓ ట్రాన్స్జెండర్ కిరీటం దక్కించుకుంది. ఆమ్స్టర్డామ్ లో జరిగిన ఓ వేడుకలో 22 ఏళ్ల డచ్ మొలుకన్ మోడల్ రిక్కీ వాలెరీ కొల్లె అనే ట్రాన్స్ జెండర్ ఈ ఘనతను సృష్టించింది. ఆమె ఈ వేడుకలో హబీబా మోస్టాఫా, లౌ డిర్చ్లు, నథాలీ మోగ్బెల్జాదాలను వెనక్కి నెట్టి మరీ మిస్ నెదర్లాండ్స్ టైటిల్ను గెలుచుకుంది. అందాల పోటీ చరిత్రలో ఓ ట్రాన్స్జెండర్కి కిరిటీం దక్కడం తొలిసారి. ఈ చారిత్రత్మక విజయం 77వ మిస్ యూనివర్స్ టైటల్కు పోటీదారుగా తన స్థానాన్ని పదిలం చేసింది. ఈ మేరకు ట్రాన్స్జెండర్ హబీబా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నా కమ్యూనిటీని గర్వించేలా చేశాను. నేను విజయం సాధించడం నాకు అత్యంత ముఖ్యం. అందుకోసం ప్రతిక్షణం తపనపడ్డా. నేను గెలుస్తానని భావించిన మిస్ నెదర్లాండ్స్ జట్టులోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.













