అమెరికాలో మీరాబాయి శిక్షణ

టోక్కో ఒలింపిక్స్ లో పతక ఆశలు రేపుతోన్న భారత అగశ్రేణి వెయిట్‍లిఫ్టర్ మీరాబాయి చాను ఆ దిశగా అమెరికాలో ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. ఒలింపిక్స్ వరకు ఆమె అక్కడే సాధన చేయనుంది. మణిపూర్‍కు చెందిన మీరాబాయి నెలన్నర రోజులపాటు శిక్షణ కోసం సాయ్ మిషన్ ఒలింపిక్ రూ.70 లక్షల 80 వేలు మంజూరు చేసింది. దీంతో 26 ఏళ్ల మీరాబాయి చీఫ్ కోచ్ విజయ్ శర్మతో సహా మరో ఇద్దరితో కలిసి నేడు అమెరికా బయలుదేరనున్నట్టు సాయ్ వర్గాలు వెల్లడించాయి.