అమెరికాలో శిక్షణకు మీరాబాయి చాను
ఆసియా క్రీడల సన్నాహాల్లో భాగంగా భారత స్టార్ మహిళా వెయిట్‌లిఫ్టర్లు మీరాబాయి చాను, బింద్యారాణి దేవి అమెరికాలో శిక్షణ తీసుకోనున్నారు. ఈ మేరకు వీరిద్దరికయ్యే ఖర్చులను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ భరిస్తుంది. 65 రోజుల పాటు సెయింట్ లూయిస్‌లో మీరాబాయి, బింద్యారాణి శిక్షణ తీసుకుంటారు. వీరిద్దరి వెంట చీఫ్ కోచ్ విజయ్ శర్మ, ఫిజియోథెరపిస్ట్ తస్నీమ్ వెళతారు. మీరాబాయి టోక్యో ఒలింపిక్స్‌లో, బింద్యారాణి 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాలు గెలిచారు.













