అగ్రరాజ్యంలో పోలార్ ప్లంజ్
అగ్రరాజ్యం అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. టొరంటో, మినియాపోలీస్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పోలార్ ప్లంజ్ కార్యక్రమాలను నిర్వహించేందుకు పలు సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ వారంలో నిర్వహించబోయే పోలార్ ప్లంజ్ ఈవెంట్లలో లక్షలాది మంది పాల్గొనబోతున్నట్టు సంబంధిత ప్రతినిధులు తెలిపారు. ఈవెంట్ నిర్వహణ ద్వారా సమకూరే మొత్తాన్ని స్పెషల్ ఒలింపిక్స్ టెన్నిస్ స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నట్టు వెల్లడిరచారు. మానసిక వైకల్యంతో బాధపడే అథ్లెట్లకు స్పెషల్ ఒలింపిక్స్ టెన్నిస్ సంస్థ తర్ఫీదునిస్తుంది. ఎముకలు కొరుక్కుతినే చలిలో జల క్రీడలను నిర్వహించే ఈవెంట్లనే పోలార్ ప్లంజ్ అంటారు. కార్యక్రమంలో పాల్గొనేవారు కొంత డబ్బును చెల్లించాల్సి ఉంటుంది.













