బాక్సింగ్ యోధుడు మైక్ టైసన్… మరో వివాదంలో!
బ్యాక్సింగ్ యోధుడు, మాజీ ప్రపంచ చాంపియన్ మైక్ టైసన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిపై వరుస పంచ్‌లతో విరుచుకుపడ్డారు. అదేపనిగా మాట్లాడుతూ విసిగెత్తించడంతో జెట్‌బ్లూ విమానం శాన్ప్రాన్సిస్కో నుంచి బయలు దేరేముందు ఈ సంఘటన చోటు చేసుకుంది. విమానంలో తన సీట్లో కూర్చున్న టైసన్ వెనుక వరుసలో ఉన్న వ్యక్తి పదేపదే మాట్లాడుతూండటంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అదేమి పట్టించుకోని ఆ వ్యక్తి రెచ్చగొట్టేలా మాట్లాడటంతో టైసన్ లేచి పిడిగుద్దులు కురిపించారు. కొద్ది సెకన్ల తరువాత విమానం దిగి వెళ్లిపోయాడు. ఆ ప్రయాణికుడు పూర్తి మత్తులో ఉంటూ రెచ్చగొట్టేలా ప్రవర్తించడవల్లే ఇలా జరిగిందని టైసన్ సన్నిహితులు ప్రకటించారు.













