కాలినడకనే అమెరికాకు శరణార్ధులు
మెక్సికో దక్షిణ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో వలసదారులు కాలి నడకన అమెరికాకు ప్రయాణం ప్రారంభించారు. పిల్లాజెల్లాతో కలిసి నిరంతరాయంగా నడుస్తూనే ఉన్నారు. మెక్సికోలోని టపుచూలాతో పాటు, దక్షిణాదిన ఉన్న పలు దేశాలకు చెందిన ప్రజలు, మెక్సికో మీదుగా అమెరికాకు వెళ్తున్నారు. స్వదేశంలో ఉద్యోగాలు లేక కుటుంబ సభ్యులతో కలిసి వీరంతా అమెరికాకు పయనమవుతున్నారు. లాస్ ఏంజిలిస్లో ఈ వారం జరగనున్న అమెరికాస్ సదస్సును దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున వలసదారులు అగ్రరాజ్యానికి వెళ్తున్నారు. వెనుజువెలా, క్యూబా సహా సెంట్రల్ అమెరికాకు చెందిన 4`5 వేల మంది శరణార్థులు నడకదారిలో అమెరికా వెళ్లేందుకు యత్నిస్తున్నారు.













