అమెరికా ఉద్యోగులకు మాత్రమే : మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ అమెరికా లో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు వెకేషన్ పాలసీని పునరుద్ధరించింది. ఫ్లెక్సిబుల్‌గా మోడర్న్ వెకేషన్ పాలసీని తీసుకొచ్చింది. మోడర్నైజ్ చేసిన వెకేషన్ పాలసీలో ఇతర సెలువులతో పాటు అపరిమితమైన సెలవులు కల్పిస్తున్ననది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ క్యాథ్లీన్ హెగాన్ సిబ్బందికి మెయిల్ ద్వారా సందేశమిచ్చారు. ఈ వెకేషన్ పాలసీకి డిస్కిషనరీ టైం ఆఫ్ అనే పేరు పెట్టారు. దీని ప్రకారం అపరిమితమైన వెకేషన్ సెలవులతోపాటు ఉద్యోగులు 10 కార్పొరేట్ సెలవులు పొందుతారు. లీప్స్ ఆఫ్ అబ్సెన్స్, సిక్‌గా ఉన్నా, మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, జ్యూరీ డ్యూటీలో ఉండి వెకేషన్ సెలవులు వాడుకోలేకపోవచ్చు. అలా వాడుకోని వెకేషన్ సెలవులకు వచ్చే ఏప్రిల్ నెలలో వేతనం చెల్లించబడుతుంది. కేవలం అమెరికాలో పని చేస్తున్న వేతన ఉద్యోగులకు మాత్రమే ఈ మార్పు వర్తిస్తుంది. అమెరికాలో ఉన్నా గంటల ప్రతిపాదిక (పార్ట్‌టైం) పని చేసే వారికి గానీ, ఇతర దేశాల్లోని వారికీ గానీ ఈ బెనిఫిట్లు లభించవు. అమెరికాలోని ఫెడరల్ రాష్ట్రాల చట్టాల వల్ల గంటల ప్రాతిపదికన పనిచేసే వారికి అమలు చేస్తే సమస్యలు తలెత్తుతాయని మైక్రోసాఫ్ట్ చెబుతున్నది. వివిధ దేశాల్లో వేర్వేరు చట్టాలు అమల్లో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈ పాలసీ అమలు చేయట్లేదని వివరణ ఇచ్చింది.













