సైన్సును ఏఐ ఏం చేస్తుందనేది ఆసక్తికరం : సత్య నాదెళ్ల
సైన్సుకు కృత్రిమ మేధ కొత్త టూల్స్‌ను అందిస్తుందని, అయితే అది సైన్సును మరింత వేగవంతం చేయడానికి ఏం చేస్తుందనేది ఆసక్తికరమని మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. వ్యవస్థను కృత్రిమ మేధ నియంత్రిస్తుందనే ఆందోళనలను కొట్టిపారేశారు. మానవ శక్తి అత్యుత్తమంగా ఉపయోగించుకోవడానికి అవసరమైన సులభతర టెక్నాలజీలను మాత్రమే కృత్రిమ మేధ అందించగనుందని చెప్పారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను మూడు అంశాలకు మద్దతుగా నిలుస్తానని, క్వాంటమ్, కృత్రిమ మేధ, హ్యూమనాయిడ్ రోబోలపై టెక్నాలజీ విస్తరించాలని కోరుకుంటున్నానని తెలిపారు. సరికొత్త క్వాంటమ్ విప్లవ ఆవిర్భావాన్ని చూడాలనుకుంటున్నానని తెలిపారు.













