బిల్‍గేట్స్ అక్రమ సంబంధంపై.. సత్యనాదెళ్ల

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‍గేట్స్ కు కంపెనీకి చెందిన ఒక మహిళా ఉద్యోగితో ఉన్న అక్రమ సంబంధంపై ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల మౌనం వీడారు. 2000 నాటి మైక్రోసాఫ్ట్ కు ఇప్పటి మైక్రోసాఫ్ట్ కు ఎంతో తేడా ఉన్నదన్నారు. ఏ ఒక్కరు ఏ సమస్య లేవనెత్తినా.. అది 20 ఏండ్ల కిందటిదైనా మేం దర్యాప్తు చేస్తాం. సమస్య లేవనెత్తిన వ్యక్తికి సంతృప్తి కలింగించే చర్యలు తీసుకుంటాం. సంస్థలో సౌకర్యవంతంగా పనిచేసే వాతావరణం కల్పించడంపై ప్రధానంగా దృష్టిసారించాం అని పేర్కొన్నారు. ఉద్యోగినితో బిల్‍గేట్స్ సంబంధం విషయం రెండేండ్ల కిందటే కంపెనీ దృష్టికి వచ్చింది. దీనిపై సంస్థ అంతర్గత విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.