ఈ యేటి మిస్ యూనివర్స్ ఎవరో తెలుసా.. ?

మిస్ యూనివర్స్ 2020 కిరీటాన్ని మెక్సికో అందం ఆండ్రియా మేజా సొంతం చేసుకున్నారు. 73 మందిని దాటుకొని 26 ఏళ్ల మేజా ఈ టైటిల్‍ను గెల్చుకున్నారు. 69వ మిస్ యూనివర్స్ పోటీలు ఫ్లోరిడాలోని సెమినోలే హార్డ్ రాక్ హాలీవుడ్ హోటల్‍లో జరిగాయి. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‍లో డిగ్రీ పట్టా పొందిన ఆమె ఈ అందాల కిరీటాన్ని దక్కించుకున్న మూడో మెక్సికన్‍గా నిలిచారు. ఆండ్రియా ర్యాంప్‍పై నడిచి అందరికీ అభివాదం చేశారు. మనం ప్రవర్తించే విధానంలో కూడా అందం ఉంటుందని, మిమ్మిల్ని ఎవరు తక్కువగా చూసినా ఒప్పుకోవద్దంటూ తుది దశలో ఆమె చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలను మెప్పించింది. ఆండ్రియా లింగ సమానత కోసం కూడా కృషి చేస్తున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ విశ్వసుందరి(2019) జొజిబినీ తుంజి ఆమెకు కిరీటాన్ని పెట్టారు. తొలి రన్నరప్‍గా మిస్ బ్రెజిల్ జులియా గామా, రెండో రన్నరప్‍గా మిస్ పెరూ జానిక్ మెసెటా డెల్ కాసిలో నిలిచారు. మిస్ ఇండియా అడెలిన్ కాస్టెలినో సైతం గట్టిపోటీనిచ్చి టాప్-5లో స్థానం సంపాదించుకున్నారు.