డల్లాస్లో భారతీయ అమెరికన్ మహిళలపై….
భారతీయ అమెరికన్ మహిళలపై డల్లాస్లో ఒక మహిళ దాడికి పాల్పడింది. ఈ ఘటన డల్లాస్లోని ఒక రెస్టారెంట్ పార్కింగ్ లాట్ వద్ద చోటు చేసుకుంది. అక్కడ భారతీయ మహిళలు కొందరు ఉండగా, మద్యం సేవించిన మెక్సికన్ అమెరికన్ మహిళ ఉన్నట్లుండి తిట్టడం మొదలు పెట్టింది. దానిని భారత సంతతి మహిళలు వీడియో తీస్తుండడంతో వచ్చి చేతితో దాడికి దిగింది. తాను కూడా వీడియో తీస్తున్నానంటూ అతి చేసింది. సదరు మహిళను మెక్సికోకు చెందిన ఎస్మెరాల్డ అప్టాన్గా గుర్తించారు. తీవ్రవాద తరహా బెదరింపులు, దాడి చేసి గాయపరచడం వంటి అభియోగాలపై ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు భారతీయుల్లారా. మొరుగైన జీవితం కోసం మీరు అమెరికా వచ్చారు. అంటే స్పష్టంగా భారతదేశంలో మెరుగైన జీవితం గడపడం లేదు అని సదరు మహిళ దూషణకు దిగింది. ఎందుకు జాతి వివక్ష దాడికి దిగుతున్నావంటూ భారతీయ మహిళ ప్రశ్నించగా మీరు భారత్ నుంచి ఇక్కడకు వచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమల్లోకి చేరడంతో సంచలనంగా మారింది.













