గ్రీన్ కార్డులపై దేశాలవారీ కోటా ఎత్తివేయాలి
అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డుల మంజూరుకు దేశాల వారీ కోటా పద్ధతికి స్వస్తి పలకాలని సిలికాన్ వ్యాలీకి చెందిన వ్యాపారవేత్త అజయ్‌జైన్ భుటో డియా అమెరికా శాసనకర్తలకు విజ్ఞప్తి చేశారు. భారతీయ అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యుడు రో ఖన్నా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అమెరికా వలస విభాగం ఏటా 1,40,000 మందికి ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డులు మంజూరు చేస్తోంది. వీటిని ప్రతి దేశానికి 7 శాతం చొప్పున కేటాయిస్తోంది. భారత్, చైనాల నుంచి ఉపాధి కోసం అమెరికాకు వలస వచ్చినవారు వేలు, లక్షల్లో ఉన్నా దేశాలవారీ కోటా వల్ల వారికి ఏటా తలా 7 శాతం గ్రీన్ కార్డులే మంజూరవుతున్నాయి. దీంతో ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డుల కోసం దాదాపు 8,80,000 మంది దరఖాస్తుదారులు, వారి భార్యా పిల్లలు సుదీర్ఘ నిరీక్షణలో ఉన్నారు. హెచ్ 1 బి వీసాల మీద లేని పరిమితి గ్రీన్‌కార్డుల మంజూరుపై ఎందుకు ఉండాలని భుటోడియా ప్రశ్నించారు.













