అందరికన్నా ముందుగా స్పందించిన చరిత్ర.. భారత్ కు

మాల్దీవులకు, ఇండియాకు మధ్య వివాదం రాజుకున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని, భారత ప్రజలను కించపరుస్తూ తమ దేశ మంత్రులు, అధికారులు చేసిన వ్యాఖ్యలను మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ (మాటి) ఖండించింది. పర్యాటకంపై ఆధారపడిన మాల్దీవులకు భారత్ అత్యంత సన్నిహితమైన పొరుగున్న ఉన్న మిత్ర దేశాలలో ఒకటని మాటి ఒక ప్రకటనలో తెలిపింది. మాల్దీవులు కష్టకాలంలో ఉన్నపుడు అందరికన్నా ముందుగా స్పందించిన చరిత్ర భారత్కు ఉందని తెలిపింది. తమతో భారత ప్రభుత్వం, ప్రనజలు అత్యంత సన్నిహిత స్నేహబాంధవ్యాలు కొనసాగిస్తున్నందుకు ఎంతో రుణపడి ఉన్నామని మాటి పేర్కొంది. మాల్దీవుల పర్యాటకాభివృద్ధికి భారత్ అందచేస్తున్న అపారమైనదని, కొవిడ్ తర్వాత మాల్దీవులు కోలుకోవడానికి భారత్ సాయం చేసిందని మాటి పేర్కొంది.











































































