అమెరికాలో నరమేధం.. 18 మందిని
అమెరికాలో మళ్లీ తుపాకీ పేలింది. మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్న ఓ సైనికుడు నరమేధానికి దిగాడు. చిన్నారులు, వారి తల్లిదండ్రులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం పారిపోతూ దార్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్పైనా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దారుణాల్లో ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 13 మందికి పైగా గాయపడ్డారు. మెయిన్ రాష్ట్రంలోని లెవిస్టన్లో ఈ ఘోరం జరిగింది. కాల్పుల అనంతరం చీకటి చాటున తప్పించుకుని పారిపోయిన హంతకుని కోసం భారీ వేగ సాగుతోంది. హంతకుడిని 40 ఏళ్ల రాబర్ట్ కార్డ్‌గా గుర్తించారు. అతడు అమెరికా ఆర్మీ రిజర్వ్‌లో ఆయుధాల ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. కొంతకాలంగా అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. హంతకుని ఫొటోను విడుదల చేశారు. అందులో అతను చేతితో ఆటోమేటిక్ రైఫిల్‌తో కన్పిస్తున్నాడు.హంతకుడు పారిపోయేందుకు ఉపయోగించినట్టుగా భావిస్తున్న కారును ఆండ్రోస్కాగిన్ కౌంటీలో స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణంపై అధ్యక్షుడు బైడెన్ మెయిన్ గవర్నర్‌తో మాట్లాడారు.













