పీవీ విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మహేశ్ బిగాల
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆస్ట్రేలియాలని సిడ్నీ నగరంలో ఈ నెల 22న ఆవిష్కరించనున్నారు. సిడ్నీలోని ఓంబుష్ పార్క్లో విగ్రహావిష్కరణ ఏర్పాట్లును పీవీ శతజయంతి ఉత్సవ కమటీ సభ్యుడు మహేశ్ బిగాల స్ట్రాత్ఫీల్డ్ కౌన్సిలర్ సంధ్యారెడ్డితో కలిసి పరిశీలించారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం స్ట్రాత్ఫీల్డ్ టౌన్హాల్లో భారీ సభ నిర్వహిస్తామని మహేశ్ బిగాల పేర్కొన్నారు. కార్యక్రమానికి పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కుటుంబీకులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెర్రీ రెడ్డి, వెంకట్ రమణ, కిశోర్, యతీన్గుప్తా, రాపోలు రాజేశ్, అరవింద్ రెడ్డి, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.













