కరోనా బాధితులకు మాటా సాయం.. మహేశ్ బిగాల

మన తెలుగు అసోసియేషన్ (మాటా) జర్మనీ శాఖ కొవిడ్ సేవల్లో భాగం పంచుకోవడాన్ని టీఆర్‍ఎస్ ఎన్నారై కో -ఆర్డినేటర్ మహేశ్ బిగాల అభినందించారు. దేశ, విదేశాల్లో ఉన్నవారెవరైనా సరే కొవిడ్ సేవల్లో పాల్గొనేందుకు ముందుకు రావావాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన నేపథ్యంలో.. మాటా జర్మనీ శాఖ ముందుకొచ్చిందని మహేశ్ బిగాల తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో మానవీయంగా స్పందాంచాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపించారు. జర్మనీ నుంచి మాటా సభ్యులు శ్రీనివాస్ కళ్లపల్లి, రాజు చిలక తనను సంప్రదించారని మహేశ్ బిగాల తెలిపారు. ఒడిశా నుంచి బయలుదేరిన ఆరు ఆక్సిజన్ ట్యాంకర్లు రైలు మార్గం ద్వారా హైదరాబాద్‍కు చేరుకున్నాయి. 87.85 టన్నుల ఈ ఎల్‍ఎంఓ ట్యాంకర్లను హైదరాబాద్‍లోని సనత్‍నగర్‍లో దిగుమతి చేయనున్నారు.