భారత్‍లో అమెరికా కొత్త రాయబారిగా… ఎరిక్ ?

భారత్‍లో అమెరికా కొత్త రాయబారిగా లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని నియమించే అవకాశాలు ఉన్నాయి. బైడెన్ పరిశీలనలో చాలా మంది పేర్లు ఉన్న ఎరిక్ ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎరిక్ ఇంతకుముందు 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచార బృందంలో కీలకంగా వ్యవహరించారు. ఈ ఎన్నికల ప్రచార బృందానికి ఆయన కో-చైర్‍గా పనిచేశారు. ఎరిక్ నియామకం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈయన నియామకానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఎరిక్ ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ మేయర్‍గా ఉన్నారు. అమెరికాలో భారతీయులు అధిక సంఖ్యలో నివసించే నగరాల్లో ఇదీ ఒకటి. అమెరికాలో రెండో అతిపెద్ద నగరం. అలాంటి నగరానికి మేయర్‍గా, డెమొక్రటిక్ క్యాంపెయిన్‍లో కీలక నేతగా ఉన్న ఎరిక్ గార్సెట్టిని భారత రాయబారిగా పంపించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది.