అమెరికాలో టోర్నడో బీభత్సం
అమెరికాలో టోర్నడో తుపాను బీభత్సం సృష్టించింది. లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా రాష్ట్రాన్ని అత్యంత శక్తివంతమైన సుడిగాలి అతలాకుతలం చేచేసింది. లాస్ ఏంజిల్స్ సమీపంలోని మోంటెబెల్లో నగరాన్ని కుదిపేసింది. ఈ టోర్నడో తుఫాను కారణంగా ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భవనాల పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయి. తీవ్రమైన పెను గాలలు ధాటికి విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు నేలకూలాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ టోర్నడో తుపాను కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తీవ్రమైన ఈ తుపాను కారణంగా భవనంపై పైకప్పులు కూలిపోయాయి. కారు అద్దాలన్నీ ధ్వంసమయ్యాయి. ఇది ఒక విపత్తు అని స్థానిక వ్యాపారి ఒకరు వెల్లడించారు. కాగా తాజా వాతావరణ పరిస్థితుల్ని పరిశోధిస్తున్నట్లు నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. ఈ టోర్నడోను బలహీనమైన సుడిగాలి గా అభివర్ణించింది.













