సునాక్ కేబినెట్ కు గోల్డ్‌స్మిత్ రాజీనామా
పర్యావరణ సంబంధిత అంశాలపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సక్రమంగా లేవంటూ బ్రిటన్ పర్యావరణ మంత్రి లార్డ్ గోల్డ్‌స్మిత్ తన పదవికి రాజీనామా చేశారు. 48 ఏళ్ల గోల్డ్ స్మిత్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మద్దతుదారుడు. కొవిడ్ సమయంలో జాన్సన్‌పై వచ్చిన పార్టీగేట్ ఆరోపణలపై విచారణ జరిపిన హౌస్ ఆఫ్ కామన్స్ హక్కుల కమిటీలోని సభ్యులను ఇటీవల విమర్శించారు. రాజీనామాపై ప్రధాని సునాక్ స్పందించారు. హక్కుల కమిటీకి క్షమాపణ చెప్పమని తాను కోరినందుకే గోల్డ్‌స్మిత్ వేరే మార్గాన్ని ఎంచుకున్నారని పేర్కొన్నారు.













