అమెరికా అదుపులో లాకర్బీ నిందితుడు
స్కాట్లాండ్లోని లాకర్బీ పట్టణంలో 1988 డిసెంబరు 21న విమానం కూల్చివేతకు ఉపయోగించిన బాంబును తయారు చేసిన నిందితుడు అబూ అగేలా మసూద్ ఖీర్ అల్ మరీమీ అమెరికా పోలీసులకు చిక్కాడు. అతడు తమ కస్టడీలో ఉన్నట్లు ఆ దేశ న్యాయశాఖ ధ్రువీకరించింది. అయితే నిందితుణ్ని ఎలా అరెస్టు చేశారో వెల్లడిరచలేదు. అబూ లిబియా పౌరుడు గతంలో ఆ దేశ నిఘా విభాగంలో పనిచేశాడు. లండన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న పాన్ ఏఎం విమానం`103పై లాకర్బీ పట్టణంలో బాంబు దాడి చోటు చేసుకుంది. నాటి ఘటనలో విమానం లోని 259 మంది సమా 270 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఉగ్ర దాడికి సంబంధించి లిబియా మాజీ నిఘా అధికారి అబ్దెల్బసెట్ అల్ మెగ్రాహి ఇప్పటికే దోషిగా తేలాడు. 2012లో అతడు మరణించాడు.













