రుషి సునాక్ కు లిజ్ ట్రస్ మద్దతు
బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రిగా నియమితుడైన రుషి సునాక్ కు మాజీ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, నూతన ప్రధాన మంత్రిగా నియమితుడైన రుషి సునాక్‌ను అభినందించారు. మీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది అని స్పష్టం చేశారు. దీపావళి పండుగ సందర్భంగా భారతీయులందరికీ లిజ్ ట్రస్ శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశంలోని మా మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. బ్రిటన్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్నవారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.













