బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా
బ్రిటన్‌లో తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. తాజాగా బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత జరిగిన ఎన్నికల తర్వాత లిజ్‌ట్రస్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆమె కేవలం 45 రోజుల పాటు పదవిలో ఉన్నారు. బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన వ్యక్తిగా లిజ్ ట్రస్ నిలిచారు. దేశంలో ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.













