భారతీయ మహిళకు అరుదైన గౌరవం
ఫ్రెంచ్ విలాసవంత ఉత్పత్తుల సంస్థ చానెల్‌కు గ్లోబల్ సీఈవోగా భారతీయురాలు లీనా నాయర్ (52) నియమితులయ్యారు. మహారాష్ట్రలోని కొల్హాపుర్‌కు చెందిన ఆమె ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ తర్వాత ఎక్స్ఎల్ఆర్ఐ (జెంషెడ్పూర్)లో ఎంబీఏ (1990-92) పూర్తి చేసి బంగారు పతకం సాధించారు. 1992లో హిందుస్థాన్ యునిలీవర్‌లో (హెచ్‌యూఎల్) మేనేజ్మెంట్ ట్రైనీగా చేరిన లీనా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం యునిలీవర్ ముఖ్య మానవ వనరుల అధికారిగా, యునిలీవర్ లీడర్షిప్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా ఉన్నారు. చానెల్ గ్లోబల్ సీఈవోగా 2022 జనవరిలో చేరనున్నారు.













