అమెరికా ఎంబసికి కువైట్ నోటీసులు
జూన్ నెల ట్రాన్స్జెండర్లకు ఎంతో ప్రత్యేకమైందో తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెలను పవిత్రంగా భావిస్తుంటారు. కాగా ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లకు మద్దతుగా ట్వీట్ చేసినందుకు కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయం సమన్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. కువైట్ విదేశాంగ శాఖ ఈ సమన్లను జారీ చేసింది. కువైట్లో ఉన్న చట్టాతు, నిబంధనలను గౌరవించాలని, వాటికి విరుద్ధంగా వ్యవహరించరాదని సమన్లలో కువైట్ విదేశాంగ శాఖ పేర్కొంది. కువైట్ సహా అనేక దేశాల్లో స్వలింగ సంపర్కం నిషేధంలో ఉంది. ఆ దేశాల్లో స్వలింగ సంపర్కం శిక్షార్హమైంది. జూన్ 2న కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయం తన ట్విట్టర్ ఖాతాలో మనుషులంతా ఒక విధమైన గౌరవ మర్యాదలతో చూడాలి. ఎలాంటి వారి మధ్య అయినా ప్రేమ అనేది భయం లేకుండా ఉండాలి. ఎల్ జిబిటిక్యూ వ్యక్తుల మానవ హక్కులను గౌరవించడంలో కాపాడటంలో అమెరికా అధ్యక్షులు ఉన్నతంగా ఉంటారు అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పైనే కువైట్ విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.













