చర్చలకు సమయం కాదేమో : రష్యా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఉక్రెయిన్ అంశంపై చర్చలు జరుగుతాయని ఫ్రాన్స్ అధ్యక్ష భవనం వెల్లడించిన కొద్దిసేపటికే మరోవైపు నుంచి విరుద్ధ ప్రకటన వెలువడింది. దీనిపై రష్యా అధ్యక్ష భవనమైన క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ ఏ విధమైన శిఖరాగ్ర సమావేశాల ప్రణాళికలు చర్చించడానికి ఇది తగిన సమయం కాదు. విదేశాంగశాఖ మంత్రుల స్థాయి సమావేశం జరగడానికి మాత్రమే అవగాహన కుదిరింది అని వ్యాఖ్యానించారు. అధ్యక్షుల స్థాయిలో సమావేశం నిర్వహించడానికి ఎటువంటి ప్రణాళికలు లేవని తేల్చి చెప్పాడు. సరైనది అనుకుంటే దేశాధ్యక్షుల సమావేశం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.













