బ్రిటన్ పార్లమెంట్ లో కింగ్ చార్లెస్-3 తొలి ప్రసంగం
బ్రిటన్ రాజు హోదాలో కింగ్ ఛార్లెస్-3 పార్లమెంట్లో తొలి ప్రసంగం చేశారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉభయ సభల సభ్యులనుద్దేశిస్తూ మాట్లాడారు. దివికేగిన ప్రియమైన మాతృమూర్తి నిస్వార్థ సేవకు ప్రతిరూపం. ప్రజాసేవకు అంకితమైన రాణి ఎలిజబెత్ బాటలో నడుస్తూ రాజ్యాంగబద్ద అత్యున్నత పాలనా ప్రమాణాలను కొనసాగిస్తా. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమైన బ్రిటన్ పార్లమెంట్లో క్వీన్ ఎలిజబెత్ సేవను మరోసారి స్మరించుకుందాం. దేవుడి, మీ పరిపూర్ణ సహకారంతో నా బాధ్యతలు నిర్వరిస్తా అని అన్నారు.













