ఆ రెండు దేశాలను అంతం చేస్తాం : కిమ్ హెచ్చరిక
తమను రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికా, దక్షిణ కొరియాను హెచ్చరించారు. లేదంటే ఆ రెండు దేశాలను పూర్తి నిర్మిలిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా, సౌత్ కొరియా మిలటరీ డ్రిల్స్ నేపథ్యంలో కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్కినల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే కనుక యూఎస్ నార్త్ కొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగే అవకాశం ఉండటంతో ఆయుధ పరీక్షలను మరింత ముమ్మరం చేయాలని కిమ్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. గత వారం 5 రోజులపాటు జరిగిన అధికార పార్టీ సమావేశంలో కిమ్ మాట్లాడుతూ మరో మూడు మిలటరీ గూఢచార ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్టు తెలిపారు. జాతీయ భద్రతను కాపాడేందుకు అవసరమైతే అణ్వాయుధాలను వాడడానికి కూడా వెనుకాడబోమని తెగేసి చెప్పారు. తమకు వ్యతిరేకంగా సైనిక ఘర్షణలకు రెచ్చగొడితే వారిని పూర్తిగా నిర్మూలిస్తామని హెచ్చరించారు.













