మళ్లీ కుమార్తెతో కనిపించిన కిమ్
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మళ్లీ తన కుమార్తె కిమ్ జు యేతో కనిపించారు. దేశ సైనిక వ్యవస్థాపక దినోత్సవ సందర్బంగా ఆయన సైనికాధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె కూడా ఉన్నారు. త్వరలో భారీ సైనిక కవాతు జరగనుందని, అందులో ఉత్తర కొరియా తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపనుందన్న వార్తలొస్తున్న నేపథ్యంలో కిమ్ సైన్యంలోని ప్రముఖ లతో భేటీ అవ్వడం విశేషం. కుమార్తెతో కలిసి కిమ్ కనిపించడం ఇది నాలుగోసారి. ఇలా పదే పదే కుమార్తెతో ప్రత్యక్షమవ్వడం వెనుక, భవిష్యత్తులో పగ్గాలు తన వారసులకే దక్కుతాయన్న సంకేతాలను కిమ్ పంపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్‌కు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు ఉన్నారు.













