ఇరువురు నేతల భేటీని క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం : శ్వేతసౌధం
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతల భేటీపై అమెరికా, జపాన్ వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. రష్యాకు ఆయుధాలు విక్రయించకూడదనే మాటకు ఉత్తర కొరియా కట్టుబడి ఉండాలని శ్వేతసౌధం జాతీయ భద్రత మండలి ప్రతినిధి కోరారు. భేటీని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఆయుధాల విక్రయం జరిగితే మరిన్ని ఆంక్షలకు వెనుకాడేది లేదని స్పష్టం చేసింది. ఐరాస ఆంక్షలు, ఏళ్ల తరబడి దౌత్యపరమైన ఏకాకితనం వంటి అంశాలపై కిమ్ తాజా భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. నేతల భేటీ ఎక్కడ అనేది ఇంకా గోప్యంగానే ఉంచారు.













